Politics9th Jan 03:28 PMSunil Byrisetty1 min read

రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారు

రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారని, పులివెందులలో కూడా జగన్ ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వైసీపీ 11 స్థానాల్లో రాజీనామ

రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారు
రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారని, పులివెందులలో కూడా జగన్ ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వైసీపీ 11 స్థానాల్లో రాజీనామా చేసి గెలవగలదా అని సవాల్ చేశారు. స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ ఇకనైనా అవాస్తవాల ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నామని, రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీకి సిద్ధాంతాలు లేవు, అరాచకమే వాళ్ల సిద్ధాంతమని, జగన్ దెబ్బకు పరిశ్రమలు పారిపోయాయని ఆనం ఆరోపించారు.
Andhra Pradesh
Rayalaseema
YS Jagan
Pulivendula
Minister Anam Ramnarayana Reddy
రాజకీయ ఆరోపణలు
Scroll for the next article