News7th May 12:23 PMSunil Byrisetty1 min read
రెండో పంటకు నీరు.. అన్నదాతల ఆనందోత్సాహాలు!
అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య సోమశిల జలాశయం నుంచి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నీరు విడుదల చేశారు. సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర సారె... జలహారతి సమ
అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య సోమశిల జలాశయం నుంచి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నీరు విడుదల చేశారు.
సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర సారె... జలహారతి సమర్పించి నీటిని విడుదల చేశారు.
నెల్లూరు జిల్లాలో రెండోపంట రబీకి సోమశిల జలాశయం నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేశారు.
రెండో పంటకు నీరు విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, రామనారాయణ రెడ్డికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సోమశిలకి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.