News23rd Jun 01:44 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై మంత్రి ఆనం సమీక్ష
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనాన
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు.
దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి ఆనంకి వేద పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చారు. అమ్మవారి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్‌పై అలాగే, కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం పనుల పురోగతిపై, అలాగే పలు అభివృద్ధి పనులపై మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. ఆలయ మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టిసారించారు. సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఈఓ శీనా నాయక్ పాల్గొన్నారు.