News5th Dec 03:10 PMSunil Byrisetty1 min read
చిన్నారులతో కలసి భోజనం చేసిన మంత్రి, కలెక్టర్
ప్రపంచంతో పోటీ పడాలని విద్యార్థులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లి
ప్రపంచంతో పోటీ పడాలని విద్యార్థులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. టెక్నాలజీని ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని గమనించండి.. సమాజానికి ఉపయోగపడే అంశాలను స్వీకరించాలన్నారు. గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడగలమో ఆలోచించాలని సూచించారు. ఇందుకు సమాజం బాధ్యత తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలలో చక్కటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చదివిస్తున్న ఉపాధ్యాయునిని అభినందించారు. ఆత్మవిశ్వాసంతో సభలో మాట్లాడిన చిన్నారులను ప్రశంసించారు. అనంతరం చిన్నారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ భోజనం చేశారు.