News30th Oct 10:34 AMSunil Byrisetty1 min read

సీఎంకు తుఫాన్ పరిస్థితులపై వివరించిన మంత్రి అచ్చెన్న

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి అచ్చెన్నాయుడు సమగ్రంగా వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు

సీఎంకు తుఫాన్ పరిస్థితులపై వివరించిన మంత్రి అచ్చెన్న
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి అచ్చెన్నాయుడు సమగ్రంగా వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గాలులు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన విషయాలను ముఖ్యమంత్రి గారికి నివేదించారు. రైతుల పంటల నష్టం, రహదారి రవాణా అంతరాయం, పల్లె ప్రాంతాల్లో గృహాల దెబ్బతిన్న పరిస్థితులను వివరించారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్, రవాణా, త్రాగునీటి పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, అవసరమైన అన్ని వనరులు సమకూర్చినట్లు వివరించారు. ముఖ్యమంత్రి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం చూపాలని ఆదేశించారు. రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Andhra Pradesh
Montha Cyclone
Minister Atchannaidu
Chandrababu Naidu
Konaseema
Power Restoration
Crop Damage
Government Review
కోన సీమ
ప్రభుత్వ సమీక్ష
మొంథా తుఫాన్
Scroll for the next article