News6th Oct 12:49 PMSunil Byrisetty1 min read
టమోటా ధరలపై మంత్రి అచ్చెన్న భరోసా
రాష్ట్రంలో పతనమైన టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరల
రాష్ట్రంలో పతనమైన టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరలు: గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయన్నారు. 30 నుంచి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ మార్కెట్ సరుకు రాదని, దసరా సెలవులు కావడంతో మరొక 10 టన్నులు అదనంగా చేరుకుందని.. రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామన్నారు. ఈ రోజు పత్తికొండ మార్కెట్ లో టమోటాలు సేకరించి చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్ కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరుకు ఎగుమతి వర్షాల వల్ల తగ్గిందన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించాయన్నారు. టమోటాలకు ట్రెండింగ్ ధరను బట్టి ప్రస్తుతం మంచి ధర లభిస్తుందని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.