News22nd Aug 09:32 AMSunil Byrisetty1 min read
వరద పరిస్థితులపై మంత్రి అచ్చెన్న సమీక్ష
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరదల పరిస్థితిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమగ్రంగా
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరదల పరిస్థితిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమగ్రంగా చర్చించారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయక చర్యల్లో ఎటువంటి లోటు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 24 గంటలూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి వరదల పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.