News9th Jul 04:52 PMSunil Byrisetty1 min read
పరిహారం ఇవ్వకుండా మత్స్యకారులను వేధించిన వైసీపీ
మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రమాదాల
మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఇతర పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసిందని తెలిపారు. అలాంటి పరిస్థితులు సృష్టించిన జగన్ ఇప్పుడు మత్స్యకారుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విమర్శలు చేసే ముందు తన ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న 63 ఎక్స్‌గ్రేషియా క్లెయిమ్‌లకు సంబంధించిన రూ.3.15 కోట్లను 2024 జూలై 8న విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందజేశామని చెప్పారు. ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రూ.9.90 కోట్ల డీజిల్ (ఆయిల్) సబ్సిడీ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసి మత్స్యకారులకు అందించిందన్నారు.