Politics14th Jul 05:19 PMSunil Byrisetty1 min read
అబద్ధాల పునాదులపై పుట్టిందే వైసీపీ
అబద్ధాలు, అసత్య ప్రచారంతో రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని, అలాంటి పార్టీ అధ్యక్షుడు జగన్‌కి మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ ప
అబద్ధాలు, అసత్య ప్రచారంతో రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని, అలాంటి పార్టీ అధ్యక్షుడు జగన్‌కి మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ పర్యటనను జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జగన్ మరోసారి నిరాశపరిచారని పేర్కొన్నారు. విశాఖ సముద్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన బాధాకరమని మంత్రి తెలిపారు. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు ప్రారంభించిందన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు. విశాఖ ఘటనలో బాధితుల ఆచూకీపై స్పష్టత రాకముందే కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించిందన్నారు. ఆ సహాయాన్ని కూడా 'ముష్టి'గా అభివర్ణించడం అవమానించడమేనని పేర్కొన్నారు.