News29th Oct 02:24 PMSunil Byrisetty1 min read
తుఫాన్ తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు: మంత్రి అచ్చెన్నాయుడు
మొంథా తుఫాన్ ముందుగా ఊహించినంత తీవ్రత కనబరచకపోయినా, విద్యుత్ సరఫరా, రహదారి రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు కలిగించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లో జి
మొంథా తుఫాన్ ముందుగా ఊహించినంత తీవ్రత కనబరచకపోయినా, విద్యుత్ సరఫరా, రహదారి రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు కలిగించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తుఫాన్ సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, తుఫాన్ ఈదురుగాలుల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సుమారు 300 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, వాటి పునరుద్ధరణ పనుల్లో 80 శాతం పూర్తి అయ్యిందని, మిగిలిన 20 శాతం పనులు రాబోయే రెండు గంటల్లో పూర్తి చేసి ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. ఎంఈడీ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు రేయింబవళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 54 సబ్‌స్టేషన్లు తుఫాన్ ప్రభావానికి లోనయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయాలని సూచించారని, ఆ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, ముమ్మిడివరం వంటి ప్రాంతాల నుంచి మానవ వనరులను తరలించి విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.