Politics20th Jun 12:58 PMSunil Byrisetty1 min read
అమావాస్య-పౌర్ణమికి వచ్చి బీభత్సం చేస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం అంటూ ఉంటే అది పులివెందుల శాసనసభ్యుడు జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికారం కోల్పోయారని జ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం అంటూ ఉంటే అది పులివెందుల శాసనసభ్యుడు జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికారం కోల్పోయారని జగన్ బాగా బాధపడుతున్నారని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదన్న అనుమానం వ్యక్తం అవుతోందని ఎద్దేవా చేశారు. ఇటీవల గంజాయి బ్యాచ్, ఉన్మాదులు, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లతో జగన్ సమావేశమవుతుండటం ఇందుకు నిదర్శమన్నారు. ఏడాది క్రితం చనిపోయిన వారిని ఇప్పుడు పరామర్శించడం వంటి పనులు చేస్తున్నారని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ చేష్టల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడి మరణిస్తున్నా తనకేం సంబంధం లేదన్నట్లు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "చంపేస్తాం, నరికేస్తాం" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకోల చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి, చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని ఆరోపించారు. అమావాస్య-పౌర్ణమి కాలానికి ప్రజల్లోకి జగన్ రెడ్డి వచ్చి నానా బీభత్సం సృష్టించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.