Politics16th Sep 04:27 PMSunil Byrisetty1 min read
రైతుల పట్ల జగన్ మొసలికన్నీరు
ఉల్లి, టమోటా రైతుల దీనస్థితి అంటూ జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. రైతుల కష్టాలు నిజంగా పట్టించుకునే హృదయం జగన్‌కి ఉంటే తన పాలన
ఉల్లి, టమోటా రైతుల దీనస్థితి అంటూ జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. రైతుల కష్టాలు నిజంగా పట్టించుకునే హృదయం జగన్‌కి ఉంటే తన పాలనలోనే రైతులను దోపిడీకి గురి చేయడమేంటి అని ప్రశ్నించారు. రైతుల పట్ల కనీసం చిత్తశుద్ధి లేని జగన్ ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లి, టమోటా రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు. మద్ధతు ధరలు, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదు, క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపించడమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జగన్ పాలనలో రైతులు కన్నీరు మున్నీరయ్యారు.. ఇప్పుడు ఆయన కార్చే కన్నీరు మొసలి కన్నీరు తప్ప మరేదీ కాదన్నారు.