Politics30th Jul 03:56 PMSunil Byrisetty1 min read
వైసీపీ హయాంలో గంజాయి పంటకే ప్రాధాన్యం
జగన్ ప్రభుత్వంలో రైతులకు చేసిందేమీ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రూపాయికే బీమా అంటూ ప్రీమియమే ఎగ్గొట్టారన్నారు. బీమా పేరు చెబుతూనే నామమాత్రపు బీమాగా మిగిల్చార
జగన్ ప్రభుత్వంలో రైతులకు చేసిందేమీ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రూపాయికే బీమా అంటూ ప్రీమియమే ఎగ్గొట్టారన్నారు. బీమా పేరు చెబుతూనే నామమాత్రపు బీమాగా మిగిల్చారని పేర్కొన్నారు. అసెంబ్లీలో మాత్రం రైతులకు బీమా చెల్లించామని అసత్యాలు చెప్పారని గుర్తు చేశారు. పులివెందుల రిజర్వాయర్ నీటిని జగన్.. తన బంధువుల కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో వ్యయసాయం కాదు.. గంజాయి పంటకే ఉత్సాహం చూపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత బీమా పథకం మళ్లీ మొదలుపెట్టామని వివరించారు. అన్నదాత సుఖీభవ కింద ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.3,156 కోట్లు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.