News11th Sep 03:04 PMSunil Byrisetty1 min read

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో అచ్చెన్న టాప్

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాక

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో అచ్చెన్న టాప్
ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు ముందుకు సాగుతున్నారని సీఎం ప్రశంసించారు. పారదర్శకత, వేగం, సమర్థతకు పెద్దపీట వేస్తూ మంత్రి అచ్చెన్నాయుడు కొనసాగిస్తున్న పనితీరు ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అలాగే ఫైల్స్ క్లియరెన్స్ లో చివరి స్థానంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిలిచారు. ఫైల్స్ క్లియరెన్స్ కు మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. హోంమంత్రి కూడా ఇంప్రూవ్ కావాలని సీఎం సూచించారు.
Andhra Pradesh
Atchannaidu
Kinjarapu Atchannaidu
E-Files Clearance
E-File Ranking
Chandrababu Naidu
File Clearance
Administrative Efficiency
పారదర్శకత
రాంప్రసాద్ రెడ్డి
కొల్లు రవీంద్ర
పయ్యావుల కేశవ్
ఏపీ మంత్రులు
Scroll for the next article