News16th Nov 03:08 PMSunil Byrisetty1 min read

తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

అక్వాన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పంటలకు నష్టం జ

తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
అక్వాన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పంటలకు నష్టం జరగకుండా, మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతులు, మత్స్యకారులకు అండగా ఉంటుందని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికీ తావివ్వొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నవంబర్ 14 నాటికి 21.32 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు పొలాల్లో ఉండగా, 2.55 లక్షల హెక్టార్లలో రబీ పంటలు వేశారని మంత్రి తెలిపారు. మొత్తం 23.87 లక్షల హెక్టార్లలో పంటలు ఉన్నాయని, ఇందులో వరి 13.60 లక్షల హెక్టార్లు, కంది 4.42 లక్షల హెక్టార్లు, పత్తి 1.92 లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్లలో పంటలు ఉండగా, అందులో 9.16 లక్షల హెక్టార్లలో వరి పంట ఉందన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందుగానే సేకరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Scroll for the next article