Politics2nd Mar 06:47 PMSunil Byrisetty1 min read

రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న వేళ ముస్లిం సోదరులందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ర

రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న వేళ ముస్లిం సోదరులందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు చేపట్టే శక్తిని ముస్లిం సోదరులందరికీ అల్లా ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణల కలయికే రంజాన్ మాసం అన్నారు. పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సమాజంలో సహనం, త్యాగం, కరుణ, సానుభూతి వంటి భావాలకు.. పరోపకారం, మానవీయ విలువలు వంటి సుగుణాలకు రంజాన్ మాసం ఒక ప్రతీక అని వివరించారు.
Minister BC Janardhan Reddy
Ramzan
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రంజాన్
Scroll for the next article