News14th Dec 12:36 PMSunil Byrisetty1 min read
అవుకు జలాశయాన్ని సందర్శించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అవుకు రిజర్వాయర్ లీకేజీ అరికట్టడానికి ఎంత నిధులు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు రూ. కోటి నిధులు విడుదల చేసి పనులు ప
అవుకు రిజర్వాయర్ లీకేజీ అరికట్టడానికి ఎంత నిధులు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు రూ. కోటి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. రాబోయే 15 - 20 రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
లీకేజీలను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు నీటిలో లోపల ఇద్దరు నిపుణులు పనిచేస్తూ వాటిని గుర్తించి.. లీకేజీలు నిర్ధారణ అయిన తర్వాత కాంక్రీట్ తో ఫిల్ చేస్తున్నారని వివరించారు. గత పదిహేనేళ్లుగా చిన్న చిన్న లీకేజీలు ఉన్నమాట వాస్తవమని.. నాడు ఈ లీకేజీలపై దృష్టి పెట్టకపోవడం వల్ల నేడు ప్రమాదకరంగా మారిన పరిస్థితి ఉందని మంత్రి స్పష్టం చేశారు.