Politics19th Mar 11:14 AMSunil Byrisetty1 min read
గోవా సీఎంతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి భేటీ
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో పాల్గొనేందుకు రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెళ్ల
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో పాల్గొనేందుకు రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెళ్లారు.
ఈ సందర్భంగా గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కర్నాటక పోర్టుల శాఖ మంత్రి ఎంఎస్ వైద్యతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
భేటీలో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో పోర్టుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
ఏపీలో పోర్టుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెట్టుబడులు & మౌలిక సదుపాయాలు కార్యదర్శి యువరాజ్, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మారిటైం బోర్డ్ సీఈవో ప్రవీణ్ ఆదిత్య, గోవా అధికారులు పాల్గొన్నారు