News26th Sep 11:49 AMSunil Byrisetty1 min read
గోదావరి తీర సమస్యలపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
ఓఎన్జీసీ, గెయిల్ వల్ల స్థానికంగా గోదావరి తీరప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ఓఎన్జీసీ, గెయిల్ వల్ల స్థానికంగ
ఓఎన్జీసీ, గెయిల్ వల్ల స్థానికంగా గోదావరి తీరప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ఓఎన్జీసీ, గెయిల్ వల్ల స్థానికంగా గోదావరి తీర ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్ ప్రస్తావించారు. గోదావరి తీర ప్రాంతంలో, ఓఎన్జీసీ, గెయిల్ వల్ల ఆయా ప్రాంతాలు కలుషితం కావడం, తలెత్తుతున్న ఇతర ఇబ్బందులు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులపై అధికారుల ద్వారా నివేదికను తీసుకుని, అందుకనుగుణంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. స్థానికంగా భూమి కుంగిపోవడం, దీంతో సముద్రంలోకి వెళ్లకుండా మురుగు నీరు డ్రెయిన్లు పొంగుతున్నాయంటూ సభ్యులు తీసుకొచ్చిన సమస్యలపై చర్యలు తీసుకొంటామన్నారు. CSR ఫండ్ కింద ఆయా కంపెనీలు స్థానికంగా నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంపై అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకుంటామని మంత్రి తెలిపారు.