News29th Apr 01:40 PMSunil Byrisetty1 min read

జగన్ రాక్షస పాలన తర్వాత ప్రజా పాలనలో రాజధాని పున: నిర్మాణం

అమరావతి రైతుల త్యాగాలు, మనోభావాలు, శ్రమ వృథా కాకూడదనే ప్రజలంతా నాటి రాక్షస పాలనకు చరమగీతం పాడారని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. రాజధానికి 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలక

జగన్ రాక్షస పాలన తర్వాత ప్రజా పాలనలో రాజధాని పున: నిర్మాణం
అమరావతి రైతుల త్యాగాలు, మనోభావాలు, శ్రమ వృథా కాకూడదనే ప్రజలంతా నాటి రాక్షస పాలనకు చరమగీతం పాడారని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. రాజధానికి 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలకు కూటమి ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని గెలిపించారని తెలిపారు. దేశంలో రాజధాని లేని నగరం ఎక్కడా లేదని, రాజధాని పునర్నిర్మాణం కోసమే ప్రజలు కూటమిని గెలిపించారని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అమరావతి వృథాగా పోకూడదనే ఆలోచనతో తిరిగి ఆయన చేతుల మీదుగా రాజధానిని పున: నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ప్రధాని సభకు విచ్చేసే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా రవాణా సదుపాయంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడటం, వేసవి కారణంగా తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కూటమిలోని 3 పార్టీల నేతల ఆధ్వర్యంలో ప్రతీ వార్డుకు ఒక ఇన్ ఛార్జిని నియమించి, ప్రజలు తరలి వచ్చేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Amaravati
Capital
BC Janardhan Reddy
farmers
రాజధాని పునర్నిర్మాణం నరేంద్రమోదీ చేతుల మీదుగా
30 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల
రైతుల త్యాగాలకు కూటమి ప్రభుత్వంతోనే న్యాయం
Scroll for the next article