News26th Apr 03:44 PMSunil Byrisetty1 min read
టార్గెట్ 5 నెలలు.. ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ పూర్తి
రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కాకినాడ
రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం, అమీనాబాద్ నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నేడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఫిషింగ్ హార్భర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌కు విచ్చేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, స్థానిక కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.
2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రూ. 361 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశారని తెలిపారు.
గత ఐదేళ్లలో వివిధ సమస్యలు - కారణాలతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ కాలవ్యవధి పూర్తయినప్పటికీ.. నేడు ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఫిషింగ్ హార్భర్ పూర్తి చేసి స్థానిక మత్స్యకారులకు అంకితం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.