News16th Nov 04:28 PMSunil Byrisetty1 min read
ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవర్గం మార్టేరులో రేనాటి వీరుడు, తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని బిసి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. బ్రిటిష్ వారికి వ్య
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవర్గం మార్టేరులో రేనాటి వీరుడు, తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని బిసి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తొలిసారి ఎదురొడ్డి పోరాటం చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పేర్కొన్నారు.
ఆ మహనీయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. అటువంటి మహనీయుల స్ఫూర్తి భావితరాలకు అందించడానికి విగ్రహాల ఏర్పాటు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తో పాటు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.