News8th Jan 05:45 PMSunil Byrisetty1 min read

అద్దె బస్సుల సమస్యలపై అసోసియేషన్లతో చర్చించిన మంత్రి

స్త్రీ శక్తి పథకం కారణంగా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, అద్దె బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దె బస్సుల అసోసియేషన్ల ప్రతినిధులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్

అద్దె బస్సుల సమస్యలపై అసోసియేషన్లతో చర్చించిన మంత్రి
స్త్రీ శక్తి పథకం కారణంగా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, అద్దె బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దె బస్సుల అసోసియేషన్ల ప్రతినిధులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు అద్దె బస్సుల్లో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సరిపడా బస్సులు లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఓవర్లోడింగ్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. దీని కారణంగా ప్రమాదాల ముప్పు, బస్సులలో ప్రయాణికుల మధ్య వివాదాలు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్న విషయాలను వారు మంత్రికి వివరించారు. అలాగే, ఓవర్లోడింగ్ కారణంగా బస్సుల నిర్వహణపై అదనపు ఆర్థిక భారం పడుతున్నట్లు, ప్రమాదం జరిగిన సందర్భంలో ఇన్సూరెన్స్ కవరేజ్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయని అసోసియేషన్ల నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం పడకుండా, అలాగే అద్దె బస్సు యజమానులకు అన్యాయం జరగకుండా సమస్యలకు పరిష్కారం చూపేందుకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Mandipalli Ramprasad Reddy
Rental Buses
Bus Owners Associations
Stri Shakti Scheme
Passenger Rush
ఓవర్లోడింగ్ సమస్యలు
ప్రజా రవాణా
ఆర్టీసీ బస్సులు
రోడ్డు భద్రత
Scroll for the next article