News30th Oct 04:41 PMSunil Byrisetty1 min read
తుఫాను బాధితులకు నిత్యవసరాలు అందించిన మంత్రి
తుఫాను ప్రభావంతో సురక్షిత ప్రదేశాలకు తరలించిన ప్రజల పునరావాస చర్యలలో భాగంగా, సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాలలో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సే
తుఫాను ప్రభావంతో సురక్షిత ప్రదేశాలకు తరలించిన ప్రజల పునరావాస చర్యలలో భాగంగా, సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాలలో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని లబ్ధిదారులకు సహాయ సామగ్రిని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 159 కుటుంబాలకు ఈ సహాయం అందించబడగా, అందులో సాలూరు నియోజకవర్గానికి చెందిన 79 కుటుంబాలు ఉన్నాయి. తుఫాను కారణంగా తమ నివాస ప్రాంతాల నుండి తరలించబడి పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులు 25 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ పామ్ ఆయిల్, 1 కేజీ కంది పప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు అందజేశారు. తుఫాను అనంతరం పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక వసతులను నిరంతర పర్యవేక్షణతో అందిస్తున్నామని అధికారులు తెలిపారు.