News14th Jul 11:27 AMSunil Byrisetty1 min read
విశాఖలో జగన్ పర్యటన.. ఇంఛార్జి మంత్రి డా.డోలా కౌంటర్!
వైసీపీ అధినేత జగన్ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి కౌంటర్ ఇచ్చారు. పరామర్శల పేరుతో జగన్ దొంగ నాటకాలు సిగ్గుచేటన్నారు. గత 5 ఏళ్లు
వైసీపీ అధినేత జగన్ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి కౌంటర్ ఇచ్చారు. పరామర్శల పేరుతో జగన్ దొంగ నాటకాలు సిగ్గుచేటన్నారు. గత 5 ఏళ్లు మత్స్యకారులను ఏం ఉద్దరించారని నేడు జగన్ విశాఖ వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన 72 గంటల్లోనే ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందజేశామని గుర్తు చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందన్నారు. వైసీపీ 5 ఐదేళ్ల పాలనలో 63 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, కనీసం వాళ్ళకి డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా జగన్ పరిహారం ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసి మత్స్యకారులకు 3.15 కోట్లు పరిహారం చెల్లించామని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎప్పుడూ అండగా నిలిచింది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు.