Politics11th Apr 04:59 PMSunil Byrisetty1 min read

బీసీల ద్రోహి జగన్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

దేశ చరిత్రలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు తెలిపారు. టిడిపి కల్పించిన రిజర్వేషన్‌ను అధి

బీసీల ద్రోహి జగన్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!
దేశ చరిత్రలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు తెలిపారు. టిడిపి కల్పించిన రిజర్వేషన్‌ను అధికారంలోకి వచ్చిన జగన్ 24 శాతానికి తగ్గించి దగా, మోసంతో బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాలకొల్లులో శుక్రవారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది గీత కార్మికులకు మోకులు, పండ్లు, కూరగాయల చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లను మంత్రి రామానాయుడు అందజేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ 3.50 కోట్లు సబ్సిడీ రుణాల చెక్కును అందించారు. మంత్రి మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు జ్యోతిరావు పూలే ఆశయాల కనుగుణంగానే బీసీల అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి వేలాదిమంది పదవులు పొందేందుకు టిడిపియే కారణమన్నారు
Nimmala Ramanaidu
TDP
BC Reservation
Palakollu
ధర్మారావు ఫౌండేషన్
బీసీ కార్పొరేషన్
Scroll for the next article