News9th Oct 01:46 PMSunil Byrisetty1 min read
టాటా ట్రస్ట్ ప్రతినిధులతో మంత్రి డా.స్వామి సమావేశం
వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్ట్ ప్రతినిధులతో మంత్రి డా.స్వామి సమావేశమయ్యారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో వాటర్ ఇన్ లైన్ క్లోరినేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్
వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్ట్ ప్రతినిధులతో మంత్రి డా.స్వామి సమావేశమయ్యారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో వాటర్ ఇన్ లైన్ క్లోరినేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. గురుకులాలు, వసతి గృహాల్లో వంట మనుషులకు నాణ్యమైన ఆహారం తయారీపై శిక్షణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి టెక్నికల్ సపోర్ట్ కి ముందుకు వచ్చినట్లు పేర్కొంది. కుప్పం, కొండపి నియోజకవర్గాల్లోని గురుకుల పాఠశాలల్లో ఫైలట్ ప్రాజెక్ట్ గా సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి స్వామి కోరారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య , ఆరోగ్యం, పోషణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. పేద విద్యార్థుల విద్య, సంక్షేమంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.