News23rd Sep 05:25 PMSunil Byrisetty1 min read

మానవత్వం చాటుకున్న మంత్రి డా. స్వామి

కాన్సర్ బారిన పడిన గురుకుల పాఠశాల విద్యార్దిని, ఆమె తల్లికి ప్రత్యేక చొరవతో వైద్యం అందించి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మానవత్వం చాటుకున్నారు. కాకినాడ ఎస్. ఎం నగర్ డా.బ

మానవత్వం చాటుకున్న మంత్రి డా. స్వామి
కాన్సర్ బారిన పడిన గురుకుల పాఠశాల విద్యార్దిని, ఆమె తల్లికి ప్రత్యేక చొరవతో వైద్యం అందించి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మానవత్వం చాటుకున్నారు. కాకినాడ ఎస్. ఎం నగర్ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్దిని మిడియం మంజుల కాన్సర్ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఏపీ APSWREIS సెక్రటరీ వి. ప్రసన్న వెంకటేష్ చొరవ తీసుకుని విద్యార్దినిని విశాఖలోని హోమీబాబా కాన్సర్ ఆస్పత్రిలో చేర్చించి ప్రత్యేక వైద్యం అందించారు. విద్యార్దిని తల్లికి కూడా కాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించటంతో ఆమెకు కూడా మంత్రి ప్రత్యేక చొరవతో వైద్యం అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న విద్యార్దిని, ఆమె తల్లి వాణి ఆస్పత్రి నుంచి డిశ్చార్డ్ అయ్యారు. ఈ సంధర్బంగా వెలగపూడి శాసనసభ లాబీల్లో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలిసి విద్యార్దిని, ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh
Minister Dola Sri Bala Veeranjaneya Swamy
Cancer Treatment
Student Welfare
Mother and Daughter Recovery
Humanitarian Gesture
మానవత్వం చాటుకున్న మంత్రి డా. స్వామి
Scroll for the next article