News16th Dec 01:07 PMSunil Byrisetty1 min read
సివిల్స్ ఉచిత శిక్షణ ప్రారంభించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణను మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రారంభించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో 340 మందికి సివి
అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణను మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రారంభించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో 340 మందికి సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను నిర్వీర్యం చేసిందన్నారు. ఐ.ఏ.ఎస్ కావాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకే అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని పేద విద్యార్థుకు ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిస్తోందని చెప్పారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని వివరించారు. సివిల్స్ కోచింగ్ అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు.