News23rd Jun 03:56 PMSunil Byrisetty1 min read
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన 26న
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా శంకుస
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, కేంద్రం ద్వారా రాష్ట్ర పర్యాటకానికి వచ్చిన నిధులు, యోగాంధ్ర-2025 విజయం, తమిళనాడు మురగన్ సదస్సు, తాజా రాజకీయ అంశాలు, సినిమా పాలసీ తదితర అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సహకారం, సీఎం చంద్రబాబు పట్టుదల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీల సాయంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు సాకారమయిందన్నారు.