News24th Mar 05:04 PMSunil Byrisetty1 min read
రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ జెండా ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేష్
విశాఖపట్నంలోని ప్రఖ్యాత రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్లూఫ్లాగ్ జెండా ఆవిష్కరించారు. సోమవారం ఉదయాన్నే విశాఖపట్నం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు అధ
విశాఖపట్నంలోని ప్రఖ్యాత రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్లూఫ్లాగ్ జెండా ఆవిష్కరించారు. సోమవారం ఉదయాన్నే విశాఖపట్నం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రుషికొండ బీచ్ వద్ద మంత్రి దుర్గేష్ ప్రసంగిస్తూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా రద్దు అయిందని, తమ దృష్టికి రాగానే వెంటనే దాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు అన్నీ తీసుకున్నామన్నారు.
అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ తోడ్పడుతుందని ఈ నేపథ్యంలో బీచ్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సూచించారు.
ఈ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరంగా ఉండేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ ల నేతృత్వంలో ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసుకున్నామన్నారు.
బీచ్ లను పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.
బ్లూఫ్లాగ్ బీచ్ పదికాలాల పాటు నిలబడాలన్నా, పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలన్నా ప్రజలు, స్థానికుల భాగస్వామ్యం చాలా అవసరమన్న అభిప్రాయాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.
నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.