News15th Jul 04:13 PMSunil Byrisetty1 min read

విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణపై స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌పై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. కలకాలం బ్లూఫ్లాగ్ గుర్తింపు కొన

విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణపై స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌పై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. కలకాలం బ్లూఫ్లాగ్ గుర్తింపు కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇవే గాక రాష్ట్రంలో మరిన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ బీచ్ క్లీన్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులు అధికంగా వచ్చే ఆర్‌కే బీచ్‌లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీచ్‌లో సుందరీకరణకు పెద్దపీట వేయాలని ఇప్పటికే పర్యాటక శాఖ తరపున రూ.24 లక్షలు కేటాయించిన విషయం విదితమే. మంత్రి కందుల దుర్గేష్ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ నిత్యం బీచ్ పరిసర ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణ, మురుగు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో పర్యాటకులకు సైతం తాము తాగి పడేసిన బాటిళ్లు, తిని పడేసిన ప్లేట్లు డస్ట్ బిన్ లో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు.
Andhra Pradesh news
visakhapatnam
minister kandula durgesh
rushikonda beach
Rushikonda Blue Flag Beach
విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణపై స్పెషల్ ఫోకస్
Scroll for the next article