News7th Aug 09:19 AMSunil Byrisetty1 min read

"ఓ ప్రేమ" మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నోడల్ ఆఫీసర్ రేగుల్ల మల్లికార్జున రావు మంత్రి దుర్గేష్ ని కలిశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ తమ ఇళ్ళ

"ఓ ప్రేమ" మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నోడల్ ఆఫీసర్ రేగుల్ల మల్లికార్జున రావు మంత్రి దుర్గేష్ ని కలిశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ తమ ఇళ్ళపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించడం, ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి, జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడిన హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై చర్చించారు. అనంతరం స్క్రీన్ ప్లే పిక్చర్స్ పతాకంపై ప్రవీణ్ కేవీ నిర్మాణంలో చిరంజీవి కృష్ణపల్లి డైరెక్టర్ మొదటి చిత్రంగా రూపుదిద్దుకుంటున్న "ఓ ప్రేమ" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ సాయి తేజవర్మ, మధుస్మిత, చిత్ర యూనిట్ కు మంత్ర దుర్గేష్ ఆల్ ది బెస్ట్ తెలపగా, అందుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh
Har Ghar Tiranga
Minister Durgesh
O Prema Movie poster
Telugu Cinema
Independence Day
హర్ ఘర్ తిరంగా
మంత్రి దుర్గేష్
ఓ ప్రేమ మూవీ
Scroll for the next article