News7th Oct 03:51 PMSunil Byrisetty1 min read

ఉర్సు ఉత్సవాలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో మంత్ర

ఉర్సు ఉత్సవాలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో మంత్రికి దర్గా ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 24 నుంచి 29 వరకూ జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మంత్రి ఫరూక్ ఆరా తీశారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని ప్రతినిధుల బృందానికి మంత్రి ఫరూక్ సూచించారు.
Scroll for the next article