News28th Aug 12:02 PMSunil Byrisetty1 min read
అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం!
అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. జార్లపాలెంలో ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. రూ. కోటితో నిర్మించనున్న జార్లపాలెం – చెరువుకొమ్
అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. జార్లపాలెంలో ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. రూ. కోటితో నిర్మించనున్న జార్లపాలెం – చెరువుకొమ్ముపాలెం తారురోడ్డుకు శంకుస్థాపన చేశారు. రూ. 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీరోడ్లు, సైడ్ డ్రైన్లును ప్రారంభించారు. అద్దంకి – కొణికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు రూ. 30 లక్షల సీసీరోడ్డును ప్రారంభించారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మాట్లాడుతూ
15 నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చూపించిందని చెప్పారు. పింఛన్లపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లను ప్రభుత్వం ఎక్కడా తొలగించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు.