News11th Sep 06:32 PMSunil Byrisetty1 min read

సూప‌ర్ 6 సూప‌ర్ హిట్ తో జ‌గ‌న్ కి భ‌యం

సూప‌ర్ 6 - సూప‌ర్ హిట్ స‌భ‌కు అనంత‌పురానికి వ‌చ్చిన ల‌క్ష‌లాది ప్ర‌జానీకాన్నిచూసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఎద్దేవా చేశారు. అన

సూప‌ర్ 6 సూప‌ర్ హిట్ తో జ‌గ‌న్ కి భ‌యం
సూప‌ర్ 6 - సూప‌ర్ హిట్ స‌భ‌కు అనంత‌పురానికి వ‌చ్చిన ల‌క్ష‌లాది ప్ర‌జానీకాన్నిచూసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఎద్దేవా చేశారు. అనంత‌పురం స‌భ విజ‌య‌వంతం అవ‌డంతో అస‌హ‌నానికి గురైన జ‌గ‌న్ త్వ‌ర‌లోనే వైసీపీని మూసేయ‌డం ఖాయ‌మ‌ని విమ‌ర్శించారు. యూరియా కొరతపై వైసీపీ నాయకులు హడావిడి చేయడం హాస్యాస్పదమని స్ప‌ష్టం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని, ఎవరైనా చేస్తే ఓర్చుకోలేర‌ని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ దోపిడీ చేయడమే జగన్ లక్ష్యమని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే చంద్రబాబు ధ్యేయమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. యూరియా కొరత లేకపోయినా వైసీపీ నాయకులు అనవసర రాద్దాంతాలతో రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
Andhra Pradesh
TDP
YSRCP
Chandrababu naidu
Jagan mohan reddy
Anantapur Meeting
Politics
Super6
Gottipati Ravi Kumar
సూపర్6 సభ
అభివృద్ధి
సంక్షేమం
Scroll for the next article