News14th Jul 04:59 PMSunil Byrisetty1 min read
వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతోనే కరెంట్ కష్టాలు
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన తప్పిదాలతోనే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు వచ్చాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రకాశం జిల్లా, కనిగిరి గార్ల
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన తప్పిదాలతోనే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు వచ్చాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రకాశం జిల్లా, కనిగిరి గార్లపేట రోడ్డులో రూ. 3.80 కోట్లతో నిర్మించనున్న 33\11 కేవీ సబ్ స్టేషన్‌కు మంత్రి డీబీవీ స్వామితో కలిసి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఇప్పటి వరకు 12 సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. ఇప్పటి వరకు 75 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రైతులకు ఇచ్చే ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల వ్యయం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.