News23rd Aug 03:22 PMSunil Byrisetty1 min read
పల్నాడు జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన
పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వినుకొండ పట్టణంలో రూ.240 కోట్లతో ఏర్పాటు చేయబోయే సమగ్ర మ
పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వినుకొండ పట్టణంలో రూ.240 కోట్లతో ఏర్పాటు చేయబోయే సమగ్ర మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేశారు. విఠంరాజుపల్లి - చినకంచెర్ల వరకు రూ.3.40 కోట్లతో నిర్మించే తారు రోడ్డుకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ. 2123 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1392 రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ రూ.10వేల కోట్లతో మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు.