News2nd Sep 12:54 PMSunil Byrisetty1 min read

విద్యుత్ ప్రమాదాల నివారణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మానవ తప్పి

విద్యుత్ ప్రమాదాల నివారణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన మంత్రి, ఏఐ సాంకేతికతను వినియోగించి ప్రమాదాలను తగ్గించే దిశగా కసరత్తులు చేయాలని ఆదేశించారు. ప్రతి ఏడాది ప్రమాదాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. “జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం పరిష్కారం కాదు, నివారణే లక్ష్యం కావాలి” అని మంత్రి హితవు పలికారు. ప్రతి త్రైమాసికానికి డిస్కంలు ప్రమాదాల నివారణపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
Andhra Pradesh
Electricity Department
Electrical Safety
Accident Prevention
Minister Gottipati Ravikumar
ఏఐ సాంకేతికత
పవర్ సెక్టార్
సేఫ్టీ సమీక్ష
Scroll for the next article