News26th Jul 10:42 AMSunil Byrisetty1 min read
భారీ వర్షాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల ప్రభావిత ప్రాంత అధికారులతో మాట్లాడారు. వ
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల ప్రభావిత ప్రాంత అధికారులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. వర్షాలు, ఈదురుగాలులతో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ చేపట్టాలన్నారు. ప్రతి 3 గం.కు ఒకసారి పరిస్థితిని సమీక్షించాలని విద్యుత్ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.