News4th Apr 12:22 PMSunil Byrisetty1 min read
జబర్దస్త్ రోజా అంటే రోత.. మంత్రి ఫైర్
జబర్దస్త్ రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగ్గుశరం లేకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు ఛీ కొట్టి1
జబర్దస్త్ రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిగ్గుశరం లేకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు ఛీ కొట్టి11సీట్లు ఇచ్చారన్నారు.
రాష్ట్రంలో నుండి ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి మరొక్కసారి సిద్ధంగా ఉన్నారన్నారు.
గత వైసీపీ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు మర్చిపోయి ఇప్పుడు సుద్దాపుసలాగా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ చేసి గురివింద సామెతలు చెబుతోందంటూ మండిపడ్డారు.
వైసీపీ అక్రమ దోపిడీ అన్యాయాలు మరచిపోయి11 సీట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
ఇంగిత జ్ఞానం లేని వైసీపీ నేతలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సంధ్యారాణి వ్యాఖ్యానించారు.