News29th Apr 04:29 PMSunil Byrisetty1 min read
లక్ష ఎకరాల్లో అరకు కాఫీ పెంపకం
కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇప్పటి వరకూ గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. మంగళవారం రాష్ట
కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇప్పటి వరకూ గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరకు కాఫీని లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.
ఇప్పటికే పార్లమెంట్ భవనంలో, రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అరకు కాఫీ ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలను పూర్తిగా నివారించేందుకు 1000 కోట్ల రూపాయలతో మారుమూల ప్రాంతాలన్నిటికీ మెరుగైన రహదార్లను అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు. 1600 గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు,156 కోట్ల రూపాయలతో పలు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తామన్నారు.