News2nd May 02:33 PMSunil Byrisetty1 min read

వైసీపీ మాటలు నమ్మొద్దు.. గిరిజనులకే 2,024 పోస్టులు..

ఆదివాసీ గిరిజన యువతా.. అధైర్యపడవద్దని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఎవరి మాటలు విని, నమ్మి మోసపోవద్దన్నారు. వైసీపీ రాజకీయ ఆటలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దన్నారు. కూటమి

వైసీపీ మాటలు నమ్మొద్దు.. గిరిజనులకే 2,024 పోస్టులు..
ఆదివాసీ గిరిజన యువతా.. అధైర్యపడవద్దని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఎవరి మాటలు విని, నమ్మి మోసపోవద్దన్నారు. వైసీపీ రాజకీయ ఆటలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 16,437 DSC పోస్టులలో 2,024 పోస్టులు గిరిజనులకేనని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. GO no3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ GO ను చంపేసింది వైసీపీ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మొద్దని సంధ్యారాణి సూచించారు.
Minister Sandhyarani
YSRCP
Adivasi tribal youth
DSC
TDP
Vizianagaram
ఆదివాసీ గిరిజన యువతా
డీఎస్సీ 2
024 పోస్టులు గిరిజనులకేనని స్పష్టం చేశారు
Scroll for the next article