Politics4th Aug 03:49 PMSunil Byrisetty1 min read

డీఎస్సీపై వైసీపీ కుట్రలకు హైకోర్టు చెక్

డీఎస్సీపై వైసీపీ నేతల పిల్ (PIL) ను హైకోర్టు నిరాకరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ కుట్ర పూరితంగా కోర్టుల్లో కేసులు వేయిస్తోందని మంత్రి మ

డీఎస్సీపై వైసీపీ కుట్రలకు హైకోర్టు చెక్
డీఎస్సీపై వైసీపీ నేతల పిల్ (PIL) ను హైకోర్టు నిరాకరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ కుట్ర పూరితంగా కోర్టుల్లో కేసులు వేయిస్తోందని మంత్రి మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం పిల్ (PIL) ను వాడుకోవడం వైసీపీ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిన వైసీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. డీఎస్సీ అభ్యర్థుల పేరుతో వైసీపీ చేస్తున్న కుట్రలను హైకోర్టు భగ్నం చేసిందన్నారు. నిరుద్యోగులకు మేలు చేసేలా అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని చెబుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు.. నిరాధారం, అర్ధరహితమని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీ నిర్వహించని వైసీపీకి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు.
Andhra Pradesh
YSRCP
High Court
Teacher Recruitment
DSC
AP DSC
BC Janardhan Reddy
హైకోర్టు
ఉపాధ్యాయ నియామకాలు
పిల్
ఏపీ ప్రభుత్వం
విద్య
Scroll for the next article