News3rd Oct 10:03 AMSunil Byrisetty1 min read
ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్
ఒడిశా గోపాల్ పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం పరిస్థితిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ, హార్ట
ఒడిశా గోపాల్ పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం పరిస్థితిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ, హార్టికల్చర్ పంటల నష్టాన్ని ప్రాథమిక అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, అవసరమైతే ఇతర జిల్లాల వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను, సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు. వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు.