News8th Oct 01:44 PMSunil Byrisetty1 min read
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి జనార్థన్ రెడ్డి వీసీ
ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి, జిల్లా ఆర్ & బీ శాఖ ఎస్ ఈ, ఈఈ లతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన వేళ జిల్లా వ్యాప
ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి, జిల్లా ఆర్ & బీ శాఖ ఎస్ ఈ, ఈఈ లతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన వేళ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఆర్ & బీ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆర్ & బీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీశైలంలో స్థానికంగా రహదారుల మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.