News9th Dec 01:47 PMSunil Byrisetty1 min read

ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీకి చర్యలు

ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన "అమరావతి

ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీకి చర్యలు
ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన "అమరావతి బాలోత్సవం"లో సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన, వక్తృత్వ, నృత్య, నాట్య, డ్రాయింగ్ పోటీలను స్వయంగా పరిశీలించారు. కాంతార, భరతమాత, రాణి రుద్రమదేవి, రైతు వేషంలోని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థులతో అమరావతి బాలోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. ఈ సందర్భంగా బాలోత్సవ కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించేందుకు వారధిగా పని చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Andhra Pradesh
Amaravati Balotsavam
Kandula Durgesh
Mock Assembly
Student Events
Cultural Fest
Essay Competition
Debate Competition
Dance Drama
Drawing Competition
విద్యార్థి అవార్డులు
సాంస్కృతిక కార్యక్రమాలు
బాలోత్సవం 2025
Scroll for the next article