News29th Oct 04:40 PMSunil Byrisetty1 min read

తుఫాను బాధితులకు అండగా ఉంటాం

తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని, ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు. బుధవారం నిడదవోలు నియోజకర్గంలోని ఎర్రకాలువ ఉధృతి

తుఫాను బాధితులకు అండగా ఉంటాం
తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని, ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు. బుధవారం నిడదవోలు నియోజకర్గంలోని ఎర్రకాలువ ఉధృతిని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు.స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్రకాలువ ప్రవాహం, పంట నష్టాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, రైతాంగం అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మార్వో, సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఎర్రకాలువ సమీపంలోని వరి పంట పొలాలు, పండ్లు, కూరగాయల తోటల పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు వెల్లడించారు. ఈ సందర్భంగా నిడదవోలు మండలంలో 17,500 ఎకరాలకు గానూ 6000 ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు మంత్రి దుర్గేష్ కు వివరాలు తెలుపగా సంబంధిత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కంసాలిపాలెం- మాధవరం మధ్య శాశ్వత బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ ఉధృతి తగ్గగానే కాలువ గట్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh
Cyclone Relief
Farmers Support
Crop Damage
Nidadavolu
Erra Kaluvu
Agriculture
వ్యవసాయం
విపత్తు నిర్వహణ
ప్రభుత్వ సహాయం
మొంథా తుఫాన్
వరద రాహిత్యం
Scroll for the next article