News14th Aug 03:07 PMSunil Byrisetty1 min read

ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగ

ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు
ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని నెహ్రూనగర్-1 లో రూ. 1.36 కోట్ల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం ఫార్మసీ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిని అంతా తిరిగి చూశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రూ.1 కోటి 1 లక్ష నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నిధులు, రూ.35 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో మొత్తంగా కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ సాధారణ నిధులు వెచ్చించి ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
Andhra Pradesh
Health
Public Healthcare
Ayushman Arogya Mandir
East Godavari
Minister Kandula Durgesh
Urban Primary Health Centre
ప్రభుత్వ వైద్యం
ప్రజా సంక్షేమం
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం
Scroll for the next article