Entertainment10th Jul 04:16 PMSunil Byrisetty1 min read

'గ్రహాంతర ప్రేమికుడు' ట్రైలర్ విడుదల

యూట్యూబర్, క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న వినూత్న ఓటీటీ చిత్రం 'గ్రహాంతర ప్రేమికుడు'. సినీ చరిత్రలోనే ఒక మైండ్‌బ్లోయింగ్ ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్,

'గ్రహాంతర ప్రేమికుడు' ట్రైలర్ విడుదల
యూట్యూబర్, క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న వినూత్న ఓటీటీ చిత్రం 'గ్రహాంతర ప్రేమికుడు'. సినీ చరిత్రలోనే ఒక మైండ్‌బ్లోయింగ్ ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు."విశ్వంలో ఏలియన్స్ ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రజలను ఆలోచింపజేసే కథాంశంతో వస్తున్న 'గ్రహాంతర ప్రేమికుడు' ఒక అద్భుత ప్రయోగం. ఏలియన్స్‌తో మానవాళికి ముప్పా? మేలా? అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలాంటి కొత్త కంటెంట్‌తో వచ్చే దర్శకులకు, ఏపీలో సినిమా తీసే ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది" అని చిత్ర యూనిట్‌ని మంత్రి దుర్గేష్ అభినందించారు. "భూమి ట్రాన్సిట్ జోన్‌లో 1,715 నక్షత్రాలు ఉన్నాయనే సైంటిఫిక్ రీసెర్చ్‌ ఆధారంగా ఈ కథను సిద్ధం చేశాం. విశ్వకాంతి వేగంతో ఏలియన్స్ ప్రయాణించే విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. AI, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, టాప్ నాచ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం." అని దర్శకుడు స్టైల్ రవి వ్యక్తపరిచారు.
Entertainment News
Grahanthara Premikudu
Style Ravi
Kandula Durgesh
OTT Movie
Telugu Cinema
Sci-Fi Movie
Alien Movie
Artificial Intelligence
విజువల్ ఎఫెక్ట్స్
కంప్యూటర్ గ్రాఫిక్స్
మూవీ ట్రైలర్
తెలుగు ఓటీటీ
Scroll for the next article